కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హెబ్బా పటేల్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీబిజీగా కొనసాగుతూ  తన క్యూట్ నటనతో కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రస్తుతం హెబ్బా "ఓదెల రైల్వే స్టేషన్" సినిమాలో గ్రామీణ యువతి పాత్రలో ఒదిగి పోయి దుమ్మురేపుతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్లో హెబ్బా ఫోజ్ అందర్నీ ఆకట్టుకుంటూ హల్ చల్ చేస్తోంది. తెలంగాణలోని ఓదెల గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు...

కన్నడ నటుడు వసిష్ఠ సింహ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది కథను మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా... అశోక్ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మొట్టమొదటిసారి వితౌట్ మేకప్ తో నాచురల్ బ్యూటీ గా సరికొత్తగా కనిపించనున్నారు. సాధారణంగా హీరోయిన్స్ అంటే వెండి తెరపై ఎంతో గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆకర్షించాలి అనుకుంటారు. నిజానికి అది కూడా వారి తదుపరి సినిమాల ఛాన్స్ కు ప్లస్ పాయింట్ అవుతుంది....

ఇలాంటి డి గ్లామరస్ గా కనిపించడం హీరోయిన్స్ కు ఒక ఛాలెంజ్ లాంటిది మరి. ఇటువంటి చిత్రాలలో కథానాయిక పాత్రల గుర్తింపు ప్రధానంగా వారి నటన పై ఆధారపడి ఉంటుంది. నవరసాలను పలికించగల హెబ్బా ఈ సినిమాలో తనేంటో నిరూపించుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. అందులోనూ ఈమధ్య తెలుగు సినీ పరిశ్రమలో హెబ్బా పటేల్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి... ఇప్పుడు ఈ చిత్రంతో తిరిగి తన జోష్ ను   చూపించనుందో  లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: