తెలుగు ఫిల్మ్ మేకింగ్ స్థాయిని అమాంతం పెంచి దేశం నలుమూలలకు విస్తరింపజేశాడు మహా దర్శకుడు రాజమౌళి. నిజానికి ఇది కూడా ఉత్తరాది ప్రేక్షకులకు తెలుగు సినిమాలపై మక్కువ ఏర్పడడానికి ఒక కారణమని చెప్పొచ్చు... అందుకే ఉత్తరాది సినీ ప్రేక్షకులకు తెలుగు నుండి వచ్చిన సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. పలువురు యంగ్ హీరోలు అక్కడ బడా హీరోలుగా మారారు. ఇక రామ్ విషయానికి వస్తే..... ఈ హీరో నటించిన గణేష్ సినిమా ఇక్కడ తెలుగులో ఎంతగా నిరాశ పరిచినదో అందరికీ తెలిసిందే. కానీ అక్కడ హిందీ వర్షన్ లో వంద మిలియన్ లకు పైగా వ్యూస్ ను సంపాదించింది. దాంతో అక్కడ హీరో రామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గణేష్ సినిమా మాత్రమే కాదు .... రామ్ నటించిన మరో ఆరు తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేశారు.
ఇంకా పలువురు తెలుగు సినీ హీరోలు వారి వారి చిత్రాలను హిందీ వర్షన్ లతో వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్నారు. కాని కేవలం ఆరు సినిమాలతో వంద మిలియన్ లకు మించి వ్యూస్ ను దక్కించుకున్న ఘనత మాత్రం రామ్ కి సొంతమైంది. ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ రేంజ్ లో ఉత్తరాదిన వ్యూస్ రాలేదు. ఉత్తరాదిన ఆరు వంద మిలియన్ లు మించి వ్యూస్ దక్కించుకున్న సినిమాలు ఉన్న హీరోగా రామ్ అరుదైన ఫీట్ ను దక్కించుకున్నాడు.. అలా హీరో రామ్ ఉత్తరాది ప్రేక్షకుల ప్లే స్టార్ గా మారిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి