బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ కంటెస్టంట్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరోగా మాత్రమే పరిచయం ఉన్న అభిజిత్ బిగ్ బాస్ లోకి వచ్చి సత్తా చాటుతున్నాడు. హౌజ్ లో పరిస్థితులు మారుతున్నా కొద్దీ అందరు తమ ప్రవర్తనలో మార్పు తీసుకొస్తున్నారు. అయితే అభిజిత్ మాత్రం మొదటి నుండి అలానే ఉంటున్నాడు. అంతేకాదు ఆటల్లో కూడా మైండ్ గేం ఆడుతూ సత్తా చాటుతున్నాడు.

అభిజిత్ కు ఆడియెన్స్ లో అదే బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. అయితే అభిజిత్ అంతకుముందు ఉన్న సీజన్లు చూసి బాగా ప్రిపేర్ అయ్యాడని అంటున్నారు. హౌజ్ లో నామినేట్ అయిన వారికే ఎక్కువ మద్దతు ఉంటుందని గమనించిన అభిజిత్ ఈ సీజన్ లో 11 వారాలు నామినేషన్స్ జరుగగా 9 సార్లు నామినేట్ అయ్యాడు. అభిజిత్ ఆట తీరు అదే అంటున్నారు.

ఇక ఈమధ్య అతన్ని టాస్కుల్లో వెనకపడుతున్నాడని చెప్పగా అందులో కూడా తను బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. అభిజిత్ తో పోటీగా సోహెల్, అఖిల్ కూడా విజేతగా నిలీచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ అవుతాడని ఇప్పటికే కొంతమంది క్లారిటీ ఇచ్చేస్తున్నారు. మరి నిజంగానే అభిజిత్ విన్నర్ గా నిలుస్తాడా లేక మరెవరైనా అతన్ని దాటి ముందుకు వెళ్తారా అన్నది చూడాలి.                                                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: