ఇక ఇందులోని డైలాగ్స్ ఇప్పటికీ కూడా పలువురు ప్రేక్షకుల నోట వినపడుతూనే ఉంటాయి. ఇక ఆ తరువాత మరొకసారి త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబు నటించిన సినిమా ఖలేజా. 2010లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ అందులో మహేష్ బాబు నటన, డైలాగ్స్, కామెడీ వంటి వాటికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే దాదాపుగా పదేళ్ల తర్వాత అతి త్వరలో మరొక సారి సూపర్ స్టార్ తో ఒక సినిమా చేయనున్నారు త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూర్తి స్క్రిప్టు సిద్ధమైనట్లు టాక్. జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు సమాచారం.దాదాపు చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత మరొకసారి మహేష్ తో చేయబోయే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో భారీ సక్సెస్ చేయాలని త్రివిక్రమ్ ని ఉద్దేశించి పలువురు మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో సోషల్ మీడియా మాధ్యమాల్లో కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మహేష్ తో చేయబోయే ఈ సినిమాని మంచి విజయవంతం అయ్యేలా పక్కాగా స్క్రిప్టు సిద్ధం చేశారట. ఒకరకంగా ఇది త్రివిక్రమ్ కి అగ్నిపరీక్ష అని అలానే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కొని ఆయన భారీ సక్సెస్ ని అందుకోవటం ఖాయమని త్రివిక్రమ్ సన్నిహితులు అభిప్రాయపడుతున్నట్లు టాక్. మరి ఇదే గనుక నిజమైతే మాత్రం ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పక తప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి