ఝుమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్‌ లో హీరోయిన్‌గా అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌య‌మ‌మై తాప్సీ పన్ను కొద్ది రోజులకు బాలీవుడ్‌కు మాకాం మార్చారు. అక్కడ మహిళా  ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఇటు తెలుగు పరిశ్రమలోనూ తన హవా చాటుతున్నారు. అందమైన కళ్ళతో ఆకట్టుకొని..తన నటనతో మైమరపించి కుర్రకారుకు జోరును పెంచిన ఈ భామ ఈమధ్య ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్‌ చేస్తూ.. డిఫరెంట్ లుక్ తో కనిపిస్తోంది.

అంతేనా అంతకుమించి కాంట్రవర్షియల్‌ కామెంట్స్‌తో వార్తల్లో ఉంటోంది ఈ కర్లీ హెయిర్ బార్బీ బొమ్మ... ఎప్పుడు గొడవలేనా..!! కూల్ గా ఈ డ్రింక్ తాగి.. చిల్ అవ్వండి బాస్.. అంటోంది. వరుస టేక్ లతో... వర్కౌట్లు లతో అలసిపోయే తాప్సీకి ఈ డ్రింక్ వెంటనే నూతనోత్సాహాన్ని ఇస్తుందని అదే తన ఎనర్జీ రహస్యమని చెప్పుకొచ్చారు తాప్సి. ‘రష్మి రాకెట్‌’ ఈ సినిమాలో తన పాత్ర కోసం భారీగా వర్కౌట్లు చేశారు తాప్సీ.. కాగా ఈ సినిమాలో విలేజ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చిన రన్నర్‌గా తాప్సీ పాత్ర ఉంటుంది.  అందుకోసం తాప్సీ చేసిన వర్క్‌ అవుట్స్ అంతా ఇంతా కాదు... ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఓ సెల్ఫ్ మేడ్‌ ప్రొటీన్‌ డ్రింక్‌ని ట్రై చేశారట.

అది తాగిన వెంటనే తనకు నూతన ఉత్సాహం వస్తుందని...  అలసట దూరం అవ్వాలనుకునేవారికి నిజంగా ఇది గొప్ప ఔషధమని హితవు పలికారు.  మీరు కూడా  ఈ డ్రింక్‌ను ట్రై చేయండి అంటూ ఫ్యాన్స్ కి టిప్ ఇచ్చారు. అంతేకాదు పిల్స్‌ని వాడకండి అంటూ ఫ్యాన్స్‌కి ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పారు. యాపిల్‌ సీడర్‌ వెనిగర్‌తో మేథీ, పసుపు, అల్లం కలిపి తాగితే అలసి పోయిన మీరు వెంటనే రీచార్జ్‌ కావొచ్చని.... తాప్సీ తెలిపారు.ఈ డ్రింక్ హెల్తీ కూడా అంటూ అభిమానులకు హెల్త్ టిప్ చెప్పారు డేరింగ్ గర్ల్ తాప్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: