రెండు రోజుల నుంచి నెటిజన్లు ఎక్కువగా వెతుకుతున్న పదం ఏమిటో చూస్తే అది ఖచ్చితంగా 'సలార్' అవుతుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించే సినిమా టైటిల్‌ కావడంతో... సలార్ అంటే ఏమిటా? అని  చాలామంది సెర్చింగ్ చేశారు. సలార్‌ తెలుగు పదం కాదు. ఎవరికీ.. అర్థం తెలియని ఈ పదాన్ని టైటిల్‌గా ఎందుకు ఎంచుకున్నారు? అరవ సినిమా డబ్బింగ్ మాదిరి .. టైటిల్ ఉందన్న కామెంట్స్‌ వస్తున్నా.. సలార్‌ పవర్‌ఫుల్‌ టైటిలే.

తమిళ హీరో విజయ్ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసేటప్పుడు మనకు పాపులర్‌ అయిన టైటిల్‌ను పెడతారు. విజయ్‌ నటించిన తేరి పోలీసోడు పేరుతో.. లాస్ట్‌ మూవీ  బిగిల్‌ అంటే ఏమిటో తెలీదు. అందుకే విజిల్‌ పేరుతో డబ్‌ చేశారు. రజనీకాంత్‌ పేటను..  కాలాను మార్చకుండా అదే టైటిల్స్‌తో రిలీజ్‌ చేశారు. కాలా మీనింగ్‌ ఏమిటో. తెలుగువాళ్లకు తెలీయకున్నా.. అదే పేరుతో డబ్బింగ్‌ చేసేశారు. చూస్తుంటే..  సలార్ తంతు కూడా ఇలాగే ఉంది.

ప్రస్తుతం కెజిఎఫ్‌2 తీస్తున్న ప్రశాంత్‌ నీల్‌ కన్నడ హీరో కాదని.. తెలుగు హీరోను తీసుకోవడం వాళ్లకు నచ్చలేదు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా.. విమర్శలు గుప్పిస్తున్నారు కన్నడిగులు. వాళ్లను బుజ్జగించే పని మొదలుపెట్టాడు దర్శకుడు. తాను  రాసుకున్న ‘సలార్‌’కథకు ప్రభాస్‌ సరిగ్గా సరిపోతాడని .. అందుకే ఆయనతో ఈ సినిమా చేస్తున్నానన్నాడు ప్రశాంత్‌. అయితే దర్శకుడి ఆన్సర్‌ వాళ్లకు నచ్చక.. మీ కథకు తగ్గ హీరో కన్నడలో లేడా అంటూ సెటైర్స్‌ వేస్తున్నారు.

సలార్‌ టైటిల్‌కు అర్థమేమిటో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చెప్పాడు. ‘సలార్‌’ అంటే సమర్థవంతమైన నాయకుడు.  యాక్చువల్‌గా సలార్‌ అనేది ఉర్దూ పదం. ప్రశాంత్‌ కన్నడ దర్శకుడు కావడంతో.. మెయిన్‌ వెర్షన్‌ను కన్నడగా తీసి.. తెలుగులోకి అనువదిస్తాడా? అనే అనుమానం వస్తోంది.

చూస్తుంటే... ప్రభాస్‌ తెలుగు హీరో కాదా ? తెలుగుతనానికి దూరమవుతున్నాడా? అనిపిస్తోంది.  సలార్‌లో కన్నడ ఫ్లేవర్‌ ఎక్కువగా వుండే అవకాశం ఉంది.  మరో పాన్‌ ఇండియా మూవీ ఆదిపురుష్‌లో నటిస్తున్నాడు. దర్శకుడు ఓం రౌత్‌ హిందీ డైరెక్టర్‌ కావడంతో.. ఈ మైథలాజికల్ మూవీని హిందీలోనే తీస్తాడు. రాధే శ్యామ్‌ మినహా ప్రభాస్‌ సినిమాలు తెలుగు ఫ్లేవర్‌ను కోల్పోతున్నాయా? అనిపిస్తోంది.  మున్ముందు ప్రభాస్‌ మన తెలుగు హీరో కాదనిపిస్తోందా? ఈలెక్కన సలార్.. ఆదిపురుష్‌ డబ్బింగ్స్‌తో తెలుగులోకి  ఎంట్రీ ఇవ్వనున్నాడు ప్రభాస్.


మరింత సమాచారం తెలుసుకోండి: