ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న ప్రముఖ షో బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకు మరింత పాపులారిటీ తో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ షో మొదటి సీజన్ సమయంలో ఇటువంటివి తెలుగులో సక్సెస్ కావు అని అన్న వారే నేడు షోని ఎంతో ఆదరిస్తున్నారని, రాబోయే రోజుల్లో తదుపరి సీజన్స్ ని మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేస్తున్నట్లు బిగ్ బాస్ బృందం చెప్తోందట.
ఇకపోతే ప్రస్తుతం సాగుతున్న ఈ తాజా నాలుగవ సీజన్ 13వ వారానికి చేరుకోవడంతో ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురిలో నేడు అఖిల్ సేవ్ చేయబడ్డాడు. దానితో అభిజీత్, మోనాల్, అవినాష్, హారిక లు మాత్రమే మిగిలారు. కాగా వీరిలో ఎవరు బయటకు వెళ్తారో మరొక్క రోజు గడిస్తే తెలుస్తుంది. మరోవైపు హౌస్ లో మొదటి నుండి కూడా తమ ఆకట్టుకునే టాలెంట్ తో కొనసాగుతున్న అఖిల్, అభిజీత్ ఇద్దరూ కూడా ఫైనల్ లో టాప్ 2 కంటెస్టెంట్స్ గా నిలుస్తారని, అలానే వారి మధ్య టైటిల్ కోసం బాగా పోటీ జరిగే ఛాన్స్ ఉందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఓవైపున చాలా వారాల నుండి ఎలిమినేషన్ లో ఉన్నప్పటికీ కూడా భారీ స్థాయి వోటింగ్స్ లో అభిజీత్ బయటపడుతుండగా, మధ్యలో కొన్ని వారాలు ఎలిమినేషన్ లో ఉన్న అఖిల్ కూడా సేవ్ చేయబడుతున్నాడు. ఇక నేడు అతడు డైరెక్ట్ గా ఫినాలే కి చేరడంతో అఖిల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అఖిల్, అభిజీత్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా నిలవడం పక్కా అనేది చాలా మంది ప్రేక్షకులు చెప్తున్న మాట. ఈ విషయమై ఏమి జరుగుతుందో, ఎవరు విన్నర్ గా నిలుస్తారో తెలియాలి అంటే మరొక రెండు వారాల వరకు వెయిట్ చేయాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: