కరోనా కారణంగా మరికొద్ది రోజులలో ముగిసి పోతున్న 2020 సంవత్సరం  ఫిలిం ఇండస్ట్రీకి ఒక పీడ కల. ఫిలిం ఇండస్ట్రీకి వేలకోట్ల నట్టాన్ని మిగిల్చిన ఈ సంవత్సరాన్ని ఇప్పట్లో ఇండస్ట్రీ వర్గాలు మరిచిపోరు. వాస్తావానికి ఈ ఏడాది మొదటి రెండు నెలలు మాత్రమే సినిమాలు వచ్చాయి ఆ తరువాత సినిమాలు లేవు.


దీనితో ఆ రెండు నెలలో విడుదల అయిన సినిమాల కలెక్షన్స్ రికార్డులే ఈ సంవత్సరం ఇండస్ట్రీ రికార్డులుగా మిగిలాయి. ఈ సంవత్సరంలో విడుదలైన సినిమాలలోని పాటలలో రికార్డులను క్రేయేట్ చేసిన సాంగ్స్ లిస్టు తీసుకుంటే ‘అల వైకుంఠపురంలో’ ని మూడు పాటలు ఈ సంవత్సరం ది బెస్ట్ సాంగ్స్ గా నిలిచాయి.



2020లో వచ్చిన పాటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న అయిదు పాటల జాబితాకు సంబంధించి ఒక సర్వే నిర్వహిస్తే అందులో నాలుగు పాటలు  మెగా హీరోలకు సంబంధించినవే. ఈ సంవత్సరం నెం.1 స్థానంలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ నిలిస్తే నెంబర్ 2 స్థానంలో ‘రాములో రాములా’ పాట నిలిచింది. ఇక నెం.3గా ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట నిలిచింది.


ఇక నెంబర్ 4 స్థానంలో ‘ఉప్పెన’ సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ నిలిచింది. 5వ స్థానంలో మళ్లీ ‘అల వైకుంఠపురంలో’ ‘సామజ వరగమన’ పాట నిలిచింది. ఈ 5 పాటల తర్వాత 6వ స్థానంలో ‘భీష్మ’ లోని ‘వాట్టే వాట్టే బ్యూటీ’ 7వ స్థానంలో ‘పలాస’ సినిమాలోని ‘నక్కిలీసు గొలుసు’ 8వ స్థానంలో ‘జాను’ లోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ 9వ స్థానంలో ‘సవారి’ లోని ‘ఉండిపోవా నువ్విలా’ నిలిచాయి. ఈ రికార్డులలో వాస్తవాల పక్కకు పెడితే ఈ రికార్డులలో కూడ మెగా కుటుంబ ఆధిపత్యం కనిపిస్తూ ఉండటంతో ఇండస్ట్రీ పై వారికి ఉన్న పట్టు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది అన్న విషయం అందరికీ తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: