ఇప్పుడు మరో ప్రాజెక్టు తో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు షాలిని పాండే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ అది స్టార్ హీరో తనయుడి చిత్రం లో కావడం విశేషం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట. మొదటి సినిమా అయినందున చిత్రాన్ని భారీగానే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ఆమె ఆల్రెడీ సైన్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది.
యశ్ రాజ్ సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో షాలిని పాండేను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో షాలిని సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని ఇక చిత్రాన్ని తెరకెక్కించడమే తరువాయి అని చెబుతున్నారు. ఇలా స్టార్ హీరో సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్ నటించనుంది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా చేస్తుందని ఫీల్ అవుతోందట ఈ హాట్ బ్యూటీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి