ప్రతివారం నలుగురు కొత్త గెస్ట్ ల ను క్యాష్ షో చేస్తూ వారితో ఫన్నీ టాస్క్ లు చేయిస్తూ ఇక ఎంతో ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులందరినీ అలరిస్తూ ఉంటుంది అంతే కాకుండా ఎంతో స్పాంటేనియస్గా పంచులు వేస్తూ తన వాక్చాతుర్యంతో రక్తి కట్టిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరైనా క్యాష్ షో కి గెస్ట్ గా వచ్చారు అంటే వారిపై పంచుల వర్షం కురిపిస్తూ.. సుమ ఒక ఆట ఆడుకుంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల విడుదలైన క్యాష్ షో కి సంబంధించిన ప్రోమో లో మాత్రం సుమ షో కి వచ్చిన గెస్ట్ లను ఆట ఆడుకోవడం కాదు ఏకంగా గెస్టులే సుమ తో ఒక ఆట ఆడుకున్నారు.
ఇటీవలే విడుదలైన క్యాష్ షో కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమోలో ఒకప్పుడు టాలీవుడ్ లో విలన్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించిన నలుగురు విలన్ లు గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. సత్య ప్రకాష్, అజయ్ రత్నం, తోటపల్లి మధు, పృథ్వీరాజ్ గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే క్యాషో ఎంతో సందడి సందడిగా సాగిపోతూ ఉంటుంది. అయితే సాధారణంగా సుమ అడిగే ప్రశ్నలకు అందరూ ఏదైనా సమాధానాలు చెబితే సుమా పంచ్ వేస్తూ ఉంటుంది కానీ ఇటీవలే విడుదలైన ప్రోమోలో మాత్రం సుమ అడిగిన ప్రశ్నలకు గెస్ట్ గా వచ్చిన వారు పంచులు వేస్తూ సుమ తో ఒక ఆట ఆడుకుంటున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి