పవన్‌ కళ్యాణ్ ఎవరితోను పెద్దగా సన్నిహితంగా ఉండడు కానీ త్రివిక్రమ్ మాత్రం దీనికి మినహాయింపు. కేవలం సినిమాల పరంగా కాకుండా సాహిత్య ఆధ్యాత్మిక రాజకీయ విషయాలలో పవన్ త్రివిక్రమ్ ల అభిప్రాయాలు బాగా కలవడంతో వీరిద్దరి సాన్నిహిత్యం సినిమాలతో సంబంధం లేకుండా కొనసాగుతూనే ఉంది.


పవన్ ‘జనసేన’ సిద్ధాంత కర్తలలో త్రివిక్రమ్ ఒకరు అన్నప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి పరిస్థితులలో పవన్ ప్రస్తుతం ముందుగా మొదలుపెట్టిన క్రిష్ సినిమాను కూడ వెనక్కు నెట్టి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక త్రివిక్రమ్ రాయబారాలు కీలకంగా పనిచేసాయి అని అంటారు. అయితే ఇద్దరు హీరోల మధ్య పోటాపోటీగా సాగే కథాంశమున్న ఆ చిత్రం పవన్ ఇమేజ్‌ కి ఎలా సూటవుతుంది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో కొనసాగుతున్న చర్చలు.


ఇదే అభిప్రాయం పవన్ అభిమానులలో కూడ ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఇమేజ్ గురించి బాగా తెలిసిన త్రివిక్రమ్‌ తో ఈ మూవీ కథకు మార్పులు చేయించి మాటలు కూడ  రాయించారు అని తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఈ మూవీ రీమేక్ షూటింగ్ ప్రారంభానికి సమస్యగా మారింది అని అంటున్నారు.  




ఇప్పుడు ఫైనల్ గా తాయారయిన ఈ మూవీ స్క్రిప్ట్ విషయాలు తెలుసుకుని పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కాస్త ఫామ్‌లో ఉన్న హీరోలెవరూ అంగీకరించడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీ స్క్రిప్ట్ ను తాయారు చేసింది త్రివిక్రమ్ కాబట్టి పవన్  పాత్రకు వెయిట్ ఎక్కువ ఇస్తాడు కనుక ఆ చిత్రంలో నటించడం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని చాలమంది హీరోలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కారణాలతో ఈ మూవీకి  సెకండ్ హీరో ఖాయం కాలేదని షూటింగ్ మొదలుపెట్టడానికి పవన్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ రెండవ  హీరో ఎవరు అన్న సమస్య తేలకపోవడంతో ఈ మూవీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: