16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన ఆ గొంతు మూగబోయిందంటే ఇంకా నమ్మశక్యం కావడం లేదు. కేవలంగా గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాతగా భారతీయ చలనచిత్ర రంగంలోనే ఆయన ఓ ప్రత్యేక అధ్యాయం. బాలు గారు సినిమాల్లో తొలి పాట పాడి నేటికి (డిసెంబర్ 15) సరిగ్గా 54ఏళ్లు పూర్తయ్యాయి.ఆయన పాటను ప్రతిభను ముందుగా పసిగట్టిందది ఎస్పీ కోదండపాణిగారు.
‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రంలో తొలిసారిగా ఆయనతో పాడించారు. అలా 1966, డిసెంబర్ 15న సాయంత్రం 6 గంటలకు బాలు తొలి పాట ‘ఏమి ఈ వింత మోహం’ రికార్డ్ అయింది. అప్పటివరకూ ఘంటసాల పాటకు అలవాటు పడిన తెలుగు సంగీత ప్రేక్షకులను ఆ కొత్త స్వరం ఆకర్షించింది. దీంతో ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. అలా 54ఏళ్ల పాటు 40వేలకు పైగా పాటలు పాడిన ఆయన ఏ గాయకుడికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుని దివికేగారు.తెలుగు ప్రేక్షకుల మదిలో ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారు.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి