ఇక ఈ సినిమా తర్వాత ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలు క్రేజీఎగా వస్తున్నాయి. ఆదిపురుష్ లో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు. కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ అంటూ సత్తా చాటడానికి వస్తుననడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు రానా, మోహన్ లాల్ కూడా నటిస్తున్నారని టాక్. ప్రభాస్, రానా అంటే మరోసారి బాహుబలి కాంబో రిపీట్ అవుతుందని చెప్పొచ్చు.
ప్రభాస్ సలార్ లో మళయాల స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేకమైన పాత్ర చేస్తారని టాక్. సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మోహన్ లాల్ ఉంటారట. అయితే ఈ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో 20 నిమిషాల ఈ పాత్ర కోసం మోహన్ లాల్ కు 20 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మోహన్ లాల్ నటిస్తే సినిమాకు మళయాళంలో కూడా క్రేజ్ వస్తుంది. అక్కడ బిజినెస్ బాగా అవుతుంది. అందుకే మోహన్ లాల్ కు అడిగినంత ఇచ్చి సినిమాలో భాగం చేశారట. మొత్తానికి సలార్ సినిమాను మరో భారీ సినిమాగా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 కాగానే సలార్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి