మరీ ముఖ్యంగా ప్రముఖ సోషల్ మీడియా మధ్యమం యూట్యూబ్ లో ఏదైనా సినిమా యొక్క టీజర్, ట్రైలర్ అలానే సాంగ్స్ కి వచ్చిన అత్యధిక వ్యూస్, లైక్స్ వంటి వాటిని ఆయా సినిమాల దర్శక నిర్మాతలతో పాటు హీరోల అభిమానులు కూడా కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఇటీవల మన టాలీవుడ్ లో అనేక సినిమాలు యూట్యూబ్లో వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకొని గొప్ప సెన్షేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాస్టర్. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ భారీస్థాయి అంచనాలున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఒక సాంగ్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచింది.
ఇక కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకాభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పాటు అది నేటితో ఏకంగా 5 లక్షలకు పైగా కామెంట్స్ దక్కించుకుని భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక మంది యూట్యూబ్ వ్యూవర్స్ కామెంట్ చేసిన మూవీ టీజర్ గా గొప్ప సెన్సేషనల్ రికార్డ్ దక్కించుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆ టీజర్ 47 మిలియన్లకు పైగా వ్యూస్ ని రెండు మిలియన్ లకు పైగా లైక్స్ ను దక్కించుకొని ఇంకా యూట్యూబ్ లో దూసుకుపోతూ ఉండటం విశేషం. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ఈ సినిమా యొక్క రికార్డును బద్దలు కొడుతుందో చూడాలి......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి