టాలీవుడ్ సినిమా పరిశ్రమకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. అయితే ఆ తరువాత ఎన్టీఆర్ తో వంశీ తీసిన బృందావనం సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

దాని అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కలయికలో తెరకెక్కిన ఎవడు సినిమా తీసిన వంశీ, ఆ సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఆపై కొంత గ్యాప్ అనంతరం నాగార్జున, కార్తీ ల కలయికలో తెరకెక్కిన ఊపిరి సినిమా తీసిన వంశీ, దాని ద్వారా కూడా భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా తీసి ఇంకొక సక్సెస్ కూడ అందుకున్న వంశీ, ఇటీవల మహేష్ తో మరొక సినిమా చేయాలని ప్రయత్నించారు. అయితే కొన్ని అనుకోని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేదు. ఇక మళ్ళి ఇటీవల మహేష్ కి స్టేట్ రౌడీ అనే పేరుతో మాస్ మూవీ తీయాలని వంశీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే దానిపై ఎక్కగా కూడా అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో వంశీ ఒక భారీ మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారని, గతంలో పలు మల్టీస్టారర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వంశీ ఈ సినిమాలో కూడా ఇద్దరు బడా టాలీవుడ్ స్టార్ హీరోలతో పని చేయనున్నట్లు టాక్. ఇప్పటికే వంశీ చెప్పిన కథ నచ్చిన ఆ ఇద్దరు హీరోలు కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ సినిమాకి సంబందించిన అధికారిక న్యూస్ సంక్రాంతి నాడు రానున్నట్లు టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: