ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్
సంగీత దర్శకునిగా దూసుకుపోతున్నాడు తమన్.. ఈ ఏడాది తన మ్యూజిక్ తో దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నాడు. తన పాటలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు... "అల వైకుంఠపురంలో" చిత్రంతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు తమన్...
ప్రస్తుతం థమన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మహేష్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు రెండింటికీ థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా నుండి వచ్చిన తొలి పాట ‘మగువా మగువా’ అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాలో థమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ కి కూడా థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.‘వకీల్ సాబ్’ సినిమా మహిళల సమస్యల చుట్టూ తిరిగే సినిమా. ఇందులో మాస్ మూమెంట్స్ పెద్దగా ఉండకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ చేయబోయే కొత్త సినిమా సంగతి వేరు. అందులో పవన్ పాత్రకి ఎలివేషన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ సీన్లకి తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...