రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీని అందిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.

ఇకపోతే దీని తర్వాత వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ వారి సలార్ సినిమా అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ చేయనున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాని కొన్ని వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత టి భూషణ్ కుమార్ నిర్మించనుండగా ఇందులో ప్రభాస్ రాముడిగా అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా నటించనున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో సీత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించే అవకాశం ఉందని కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో భరతుడి పాత్ర కు గాను ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ ను ఎంపిక చేశారట మూవీ యూనిట్. అభిజిత్ అయితేనే భరతుడి పాత్రకు న్యాయం చేయగలడని భావించిన దర్శకుడు ఓం రౌత్, నిన్న అతడి ని సంప్రదించి కాల్ షీట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో పలువురు ఇతర నటుల ఎంపిక కూడా ఇప్పటికే పూర్తయిందని వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానుంది అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అఫిషియల్ గా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: