టాలీవుడ్ సినిమా పరిశ్రమకి యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన కీర్తి సురేష్ అందులో తన ఆకట్టుకునే అందం అభినయంతో ప్రేక్షకులు అలానే అభిమానుల మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని సరసన ఆమె నటించిన నేను లోకల్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది.

అయితే అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటించిన అజ్ఞాతవాసి సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఆపై ఆమె నటించిన మహానటి సినిమా మాత్రం గొప్ప సక్సెస్ ని అందుకని ఆమెకు హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పట్టడంతో పాటు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఇక దానితో కీర్తి సురేష్ క్రేజ్ అలానే పాపులారిటీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత మంచి పేరు దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట మూవీలో నటిస్తోంది.

అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు అలానే అభిమానులకు తన సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకునే అలవాటు ఉన్న కీర్తి సురేష్ నేడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని  తన ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్రిస్మస్ ట్రీ ని అలానే తన సెలబ్రేషన్స్ ని వీడియో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం  అది ఎంతో వైరల్ అవుతుండగా పలువురు ఆమె అభిమానులు అలానే ప్రేక్షకులు కీర్తికి ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: