ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో మరొక హీరో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.

ఇకపోతే దీని తరువాత హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించే సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీయనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇకపోతే ఈ సినిమాని గతంలో తామిద్దరి కలయికలో తెరకెక్కించిన అరవింద సమేత ని మించేలా తీయనున్నారట దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రాసుకున్న త్రివిక్రమ్, ఇందులో హీరోయిన్ గా ఇప్పటికే పలువురిని పరిశీలించి ఫైనల్ గా గోల్డెన్ లెగ్ భామ పూజా హెగ్డే ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. నిజానికి గతంలో త్రివిక్రమ్ తీసిన అరవింద తో పాటు ఇటీవల వచ్చిన అలవైకుంఠుపురములో మూవీ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది.

అయితే ఈ సినిమాలోని పాత్ర కి పూజా అయితే పక్కాగా సరిపోతుందని భావించిన త్రివిక్రమ్ ఇటీవల ఆమెను ప్రత్యేకంగా కలిసి సినిమా కథ, కథనాలు వినిపించడంతో పాటు ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే మరొక్కసారి త్రివిక్రమ్ తీయబోయే తదుపరి సినిమాలో కూడా పూజా నే హీరోయిన్ కావడంతో అబ్బా మళ్ళి ఆమెనే తీసుకుంటున్నారా గురూజీ అంటూ పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: