టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌తో పెద్ద పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు తీసిన ఘ‌న‌త నిర్మాత బెల్లంకొండ సురేష్ సొంతం. ఆయ‌న త‌న సినిమా వార‌స‌త్వాన్ని కంటిన్యూ చేస్తూ త‌న త‌న‌యుడు సాయి శ్రీనివాస్‌ను అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేశాడు. తొలి సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు శ్రీను. వివి. వినాయ‌క్ డైరెక్ష‌న్‌. స‌మంత  హీరోయిన్‌. ఓవ‌రాల్‌గా ఈ సినిమాకు అప్ప‌ట్లోనే ఏకంగా 40 కోట్లు ఖ‌ర్చు పెట్టాడు. సినిమా హిట్ అయినా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచి బెల్లంకొండ‌కు రు. 10 కోట్ల న‌ష్టం మిగిల్చింది.

అప్ప‌టి నుంచి బెల్లంకొండ ప్ర‌తిది భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. జ‌య జాన‌కీ నాయ‌క‌, సాక్ష్యం ఇలా వ‌రుసగా మంచి క‌థ‌ల‌తో, మంచి ద‌ర్శ‌కుడు, కాస్టింగ్‌తో సినిమాలు చేస్తున్నా ఏదీ క‌లిసి రావ‌డం లేదు. బెల్లంకొండ ప్ర‌తి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గానే నిలిచింది. మ‌ధ్య‌లో కోలీవుడ్ హిట్ మూవీ రాక్ష‌సుడు సినిమాను మాత్రం త‌క్కువ బ‌డ్జెట్‌తో చేసి మంచి హిట్ కొట్టాడు. అంత‌కు ముందే క‌వ‌చం, సీత సినిమాలు ప్లాపే అయ్యాయి.

ఇప్పుడు స‌డెన్‌గా షాక్ ఇస్తూ మ‌నోడు సంక్రాంతి రేసులో ఉన్నాడు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ చిత్రాన్ని పూర్తి చేశాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న ఈ సినిమా వ‌స్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ వివ‌రాలు చూస్తే మ‌నోడు మ‌ళ్లీ ఓవ‌ర్ చేస్తున్నాడ‌నే అనుకోవాలి. అల్లుడు అదుర్స్ సినిమాకు ఏకంగా 38 కోట్ల నుండి 40 కోట్ల వరకూ పెట్టినట్లు సమాచారం. మరి ఈ రేంజ్ బడ్జెట్ అంటే బెల్లంకొండ రిక‌వ‌రీ చేస్తాడా ? అన్న డౌట్లు ఉన్నాయి.

సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే కూడా బొక్క ఖాయంగా ఉంది. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో 50 శాతం టిక్కెట్లు మాత్ర‌మే అమ్మాలి. ఓ వైపు సంక్రాంతికి ర‌వితేజ క్రాక్‌, రామ్ రెడ్ సినిమాలు పోటీలో ఉన్నాయి. ఐదేళ్ల‌కు ఓ చిన్న హిట్ వ‌చ్చిందో లేదో బెల్లంకొండ మ‌ళ్లీ ఓవ‌ర్ బ‌డ్జెట్ పెట్టేశాడు. ఈ సినిమా ఏం చేస్తుదో ?  చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: