ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. ఈ సినిమాను స్రవంతి రవికిశోర్ నిర్మించగా సినిమాలో రామ్ సరసన మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ లు ఫీమేల్ లీడ్ గా నటించారు. కోలీవుడ్ లో ఆల్రెడీ సూపర్ హిట్టైన తడం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ లో నటించాడని తెలిసిందే.

రామ్ రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సెన్సార్ టీం రామ్ రెడ్ సూపర్ అనేశారని టాక్. ఇస్మార్ట్ శంకర్ హిట్ మేనియా కొనసాగించేలా రామ్ రెడ్ సినిమా ఉందని అంటున్నారు. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన రెడ్ సినిమా సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెన్సార్ ఇచ్చిన బూస్టింగ్ బాగుందని టాక్.

ఇస్మార్ట్ శంకర్ ముందు వరకు కెరియర్ డైలమాలో ఉన్న రాం పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అందుకోవడంతో తనని ఆడియెన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో ఒక క్లారిటీకి వచ్చాడు. ఇక అందుకే రామ్ రెడ్ సినిమా స్పెషల్ గా స్క్రీన్ ప్లేని మళ్లీ రాయించుకుని తన మాస్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన స్టామినా చూపించేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా రామ్ ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమా అవుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: