100 కోట్లతో ఒక సినిమా తీయాలి అంటే ఆ హీరో ఒక రేంజ్ హీరో అయి ఉండాలి. అయితే ‘హ్యాపీ డేస్’ మూవీలో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ ఇప్పుడు 100 కోట్ల సినిమాలో నటిస్తూ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. హ్యాపీ డేస్ మూవీలో టైసన్ పాత్ర అప్పట్లో హీరో వరుణ్ సందేశ్ పాత్రను మించి హైలైట్ అయిన విషయం తెలిసిందే.
కానీ ఆ మూవీ ద్వారా వచ్చిన గుర్తింపును రాహుల్ సరిగా ఉపయోగించు కోలేకపోయాడు అన్న విమర్శలు ఉన్నాయి. ఆమూవీ తరువాత రాహుల్ వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో చేసిన ‘రెయిన్ బో’ మూవీ ఫెయిల్ అయింది. ఆతరువాత అతడు నటించిన ‘వెంకటాపురం’ అనే క్రైమ్ మూవీ కూడా ఫెయిల్ అయింది. దీనితో అతడి కెరియర్ పూర్తి అయిపోయింది అని అనుకున్నారు అంతా.
అయితే వారు ఊహించని విధంగా రాహుల్ తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘100 క్రోర్స్’ టైటిల్ తో ఒక కొత్త మూవీ ప్రాజెక్ట్ ను రాహుల్ అనౌన్స్ చేసి ఇంకా తాను ఇండస్ట్రీలోనే ఉన్నాను అన్న సంకేతాలు ఇస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కథ డబ్బుతో ముడిపడ్డ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. విరాట్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేని సాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంటే ప్రస్తుత కాలంలో పెద్దగా సినిమాలు లేని సాయి కార్తీక్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. నేటితరం ప్రేక్షకులు మరిచిపోయిన ‘హ్యాపీ డేస్’ హీరో పెద్దగా అవకాశాలు లేని హీరోయిన్ ఒక కొత్త దర్శకుడు కలిసి పని చేస్తున్న ఈ మూవీ సక్సస్ అయితే మళ్ళీ రాహుల్ కు యూత్ లో మంచి క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది..

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి