‘అరుంధతి’లో జేజేమ్మగా తన నటవిశ్వరూపం చూపించిన నాటినుండి టాలీవుడ్ లో స్వీటీ అనుష్కకు హీరోలతో సమానంగా క్రేజ్ పెరిగి పోయింది. దీనితో ఆమెకు హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్‌ వరుస పెట్టి వస్తున్నాయి. ఈమధ్య కాలంలో అనుష్క నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘వర్ణ’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తిన్నా అనుష్క క్రేజ్ ఎక్కడా తగ్గలేదు.  ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ బడ్జెట్ సినిమాలు ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లలో నటిస్తూ రాబోయే రోజుల్లో కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు, ఒంటి నిండా ఆభరణాలుండే రోల్స్ కు గుడ్ బై చెపుతానని చెప్పి హీరో అజిత్ తో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రేమ గీతాలు పాడుకుంటున్న అనుష్క మళ్ళీ యూటర్న్ తీసుకుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆమధ్య కాలంలో అనుష్క కుతుబ్ షా ఆ స్థానంలో నర్తకిగా పేరు గాంచిన తారామతి పాత్రతో అనుష్క ఒక సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అప్పట్లో అనుష్క ఖండించింది. అయితే అనుకోకుండా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ‘మిర్చి’ సినిమాను తీసిన ప్రభాస్ స్నేహితులు నిర్మాతలుగా నిర్మించబోతున్న ఈ తారామతి స్క్రిప్ట్ పూర్తిగా నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపిస్తాడని టాక్. ఈ సంవత్సరాంతానికి ‘బాహుబలి’ నిర్మాణం ఒక కొలిక్కి వచ్చాక తారామతి సెట్స్ పైకి వెళుతుంది ని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: