ఖైదీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్ ఇళయదళపతి విజయ్ తో చేసిన సినిమా మాస్టర్. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన మాస్టర్ సినిమా తెలుగులో మంచి వసూళ్లను రాబడుతుంది. సినిమా 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రెండు రోజులకే 7.35 కోట్లతో అదరగొట్టిందని తెలుస్తుంది.

సినిమాలో విజయ్ స్టైల్, యాక్షన్ తెలుగు ఆడియెన్స్ కు నచ్చేసింది. అయితే కోలీవుడ్ లో సీన్ వేరేలా ఉంది. విజయ్ తో మాస్టర్ అంటూ రొటీన్ కథతో వచ్చారని అక్కడ దళపతి ఫ్యాన్స్ నిరాశచెందారు. అక్కడ వసూళ్లు సోసోగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు బాగున్నాయి. విజయ్ మాస్టర్ మొదటి రోజు 5.75 కోట్లు రాబట్టగా రెండో రోజు 1.60 కోట్లు వసూళు చేసిందని తెలుస్తుంది.

విజయ్ కు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉందని మాస్టర్ వసూళ్లను చూసి చెప్పొచ్చు. అయితే తెలుగులో విజయ్ డైరెక్ట్ ప్రమోషన్స్ కు వస్తే తప్పకుండా ఆ ఎఫెక్ట్ వసూళ్ల మీద కూడా పడే అవకాశం ఉంది. కాని విజయ్ హైదరాబాద్ వచ్చి సినిమా ప్రమోట్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఖైదీతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ విజయ్ స్టైల్ తో సినిమాను నడిపించాలని అనుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం విశేషం. అయితే ఇద్దరు సూపర్ హీరోస్ నటించడంతో తమిళంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: