టాలీవుడ్ లో విలన్ పాత్ర కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికి తెలిసిందే.. విలన్ ఎంత బలవంతుడై ఉంటే అతన్ని కొట్టే హీరో అంత ఎలివేట్ అవుతాడు అన్నది ఇక్కడి దర్శక నిర్మాతల అభిప్రాయం.. హీరో ఎంత సింపుల్ గా ఉన్నా, విలన్ మాత్రం కండలు తిరిగిన బాడీ తో, రింగుల జుట్టు తో చూడడానికి భయపడేలా ఉండాలి.. అలాంటి వాడిని కొట్టే హీరో ఎంత నార్మల్ గా ఉంటే సినిమా అంత సూపర్ హిట్.. ఈ ట్రెండ్ ని గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ పాటిస్తూ వస్తుంది. ఈ విలన్ పాత్రల కోసం గతంలో   కొంతమంది నటులు సెపరేట్ గా ఉండేవారు.. వారు మాత్రమే ఈ పాత్రలను వేసి ప్రేక్షకులను మెప్పించేవారు.

అమ్రిష్ పురి, ముఖేష్ రుషి, రామిరెడ్డి, జయప్రకాశ్ రెడ్డి  ఇలా చాలామంది నటులు సెపరేట్ గా విలన్ పాత్రల కోసమే అన్నట్లు ఉండేవారు కానీ ఇప్పుడు పాత్ర బాగుండి, తాము హైలైట్ అవుతున్నాం అంటే స్టార్ హీరో లు కూడా నెగెటివ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం సందేహించట్లేదు. ఇప్పటికే దగ్గుబాటి రానా, సుధీర్ బాబు, ఆర్య వంటి యంగ్ హీరోలు విలన్ పాత్రలు చేసి అల్ రౌండర్స్ అనిపించుకున్నారు. ఈ కోవలోకి ఇంకా కొంతమంది హీరోలు కూడా వచ్చి చేరుతున్నారు.

కాగా  తమిళంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ సేతుపతి టాలీవుడ్ లో విలన్ పాత్రలకు ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. ఇప్పటికే అయన విలన్ గా నటించిన ఉప్పెన సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.. మరిన్ని సినిమాల్లో కూడా విజయ్ ని విలన్ గా నటింప చేసే ఆలోచనలో తెలుగు దర్శకులు ఉన్నారట.. తెలుగు హీరోలకు ధీటుగా విలన్ పాత్రలకు విజయ్ సెట్ అవుతాడని టాలీవుడ్ లో అయన పేరు మార్మోగిపోతుంది.  విజయ్ మనసులో ఏముందో తెలీదు కానీ టాలీవుడ్ లో విలన్ అంటే అందరికి విజయ్ సేతుపతి నే గుర్తొస్తున్నాడు.  సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలలో విజయ్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోగా మాత్రం వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో 'లాభం' ఒకటి. ఈ సినిమాలో విజయ్ సంఘసేవకుడిగా కనిపించబోతున్నాడు. అలాగే త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: