ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొంతమంది మంది నటులు వుంటారు. వారి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. అందువల్ల సహజంగా వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కొంతమంది నటులు చాలా బిజీగా మారుతున్నారు కూడా. అలాంటి అతికొద్ది నటీనటులలో సముథ్రకని ఒకరు. కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న సముథ్రకని అతి తక్కువ సమయంలో తెలుగు ఆడియేన్స్ కు బాగానే కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించిన ఆయన నటుడిగా మారిన తరువాత భారీ స్థాయిలో ఆఫర్స్ అందుకుంటున్నారు.

ఇటీవల క్రాక్ లో నెగిటివ్ రోల్ తోనే స్క్రీన్ పై సరికొత్తగా దర్శనమిచ్చారు. అసలు మ్యాటర్ లోకి వస్తే "ఆర్ ఆర్ ఆర్"  సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సముథ్రకని డైరెక్టర్ రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి చెప్పాడు. క్రాక్ కు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సముథ్రకని.. డైరెక్టర్ రాజమౌళితో స్నేహం ఇప్పటిది కాదు అంటూ దాదాపు 11 ఏళ్ళ నుండి కూడా బాగా పరిచయమని చెప్పాడు.

శంభో శివ శంభో మొదట తమిళ్ లో తీసినప్పుడే రాజమౌళి ఎంతగానో మెచ్చుకున్నట్లు చెప్పిన సముథ్రకని ఆ తరువాత నటుడిగా కూడా చాలాసార్లు మెచ్చుకున్నారని అన్నాడు. ఇక ఆ చొరవతోనే "ఆర్ ఆర్ ఆర్"  సినిమాలో ఒక మంచి పాత్రలో నటించే అవకాశం  ఇచ్చినట్లు వివరణ కూడా ఇచ్చాడు సముథ్రకని.ఆ చాలా బాగా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: