రానా త్రిషల స్నేహం గురించి తెలియని వారుండరు. కనీసం నెలకు ఒకసారైనా ఎదో ఒక సంచలన వార్తలో వీరిద్దరూ మీడియా కంట పడుతూ ఉంటారు. తమ మధ్య స్నేహం తప్పించి మరేమిలేదు అని ఖచ్చితంగా వీరు చెప్పినా మీడియా మాత్రం ఎదో ఒకటి వీరిద్దరి పై రాస్తూనే ఉంటుంది. అటువంటి ఈ జంట పై వస్తున్న ఒక లేటెస్ట్ న్యూస్ అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ప్రస్తుతం రానా రెండు, మూడు సినిమాలు బాలీవుడ్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలన్నీ కూడా మల్టీ స్టారర్ సినిమాలే ఈ సినిమాలలో ఒక సినిమాకు సంబంధించి రానాకు జంటగా త్రిషను నటించమని ఒక బాలీవుడ్ నిర్మాత అడిగితే తాను రానా పక్కన నటించను అని తెగేసి చెప్పిందట త్రిష. ఎప్పుడూ పార్టీలలో, పబ్బులలో రానా తో జంటగా హడావిడి చేసే త్రిష చెప్పిన సమాధానానికి షాక్ కు గురైన ఆ నిర్మాత ఆ విషయాన్ని రానాకు చెప్పాడట. ఆ న్యూస్ విన్న రానా సైతం ఆశ్చర్యపోయి త్రిషను అడిగితే తెరమీద జంటగా కనపడితే తమ మీద వస్తున్న వార్తలు నిజం అనుకునే అవకాసాలు ఉన్నాయి అంటూ విచిత్రమైన సమాధానం ఇచ్చిందట త్రిష.  అయితే విశ్లేషకులు మాత్రం త్రిష సమాధానంలో కొత్త అర్ధాన్ని వెతుకుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఆమెకు క్రేజ్ లేకపోయినా బాలకృష్ణతో నటిస్తున్న గాడ్సే చిత్రం కోసం త్రిష ఆ సినిమా నిర్మాతల నుండి సుమారు కోటి రూపాయలు పైన ముక్కు పిండి వసూలు చేసినట్లుగా, రానా సినిమా నిర్మాతల దగ్గర ఇలా భారీ మొత్తాలు వసూలు చేసే అవకాశం ఉండదనే, రానాకు ఇటువంటి షాకింగ్ రిప్లై ఇచ్చి ఉంటుందని అంటున్నారు. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే మూడు పదులు వయస్సు దాటిపోయినా త్రిష భారీ పారితోషికాలను అందుకుంటూనే ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: