దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కెరియర్ కు నందమూరి తారకరామారావు సినిమాలు పునాది. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఇప్పటికీ బుల్లితెర పై కనిపిస్తూ ఉంటె ఈ తరం వారు కూడా చాల ఆనందంగా చూస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ స్థాయి అందుకున్నా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అడవిరాముడు’ సృష్టించినంత హంగామా మరే సినిమా ఇప్పటి వరకు సృస్టించ లేకపోయింది అనే విషయం వాస్తవం. అనునిత్యం గెడ్డంతో పైకి చాల గంభీరంగా కనిపించే రాఘవేంద్రరావును తాను బుల్లి తెర పై సమర్పిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమం రాఘవేంద్రరావు కంట కన్నీరు పెట్టించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాఘవేంద్రరావు ఎన్టీఆర్ గురించి గుర్తుకు చేసుకుంటూ తన సన్నిహితులు ఆప్తులు చనిపోయినప్పుడు కూడా తనకు కన్నీరు రాలేదని కాని నందమూరి తారకరామారావు పేరు చెపితే తనకు గౌరవంతో పాటు కన్నీరు కూడా ఆగదని అంటూ ఎన్టీఆర్ లేకుంటే ఈరోజు తాను అనుభవిస్తున్న సూపర్ దైరెక్టర్ స్టేటస్ తనకు వచ్చి ఉండేది కాదని ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటూ రాఘవేంద్రరావు కన్నీరు రావడం ఆశ్చర్య పరిచింది. హీరోయిన్స్ ను అత్యంత రొమాంటిక్ గా చూపెట్టే రాఘవేంద్రరావు మనసులో ఇంత సున్నితమైన భావాలు ఉన్నాయా అని అనిపించే డట్లుగా రాఘవేంద్రుడి ప్రవర్తన సాగింది. ఈరోజు రాత్రిప్రసారం కాబోతున్న ‘సౌoదర్య లహరి’ కార్యక్రమంలో దర్శకేంద్రుడు నందమూరి తారకరామారావు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియచేయబోతున్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: