మహేష్ బాబును సూపర్ స్టార్ గా మార్చిన ‘పోకిరి’ ఒక ట్రెండ్ సెటర్. ఈ సినిమా తరువాత మహేష్ క్రేజ్ ఎవరూ ఊహించని స్థాయికి చేరిపోయింది. అప్పటిదాకా వెండితెర రాజకుమారుడిలా ఉండే మహేష్ తన సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో తనని తాను నటన పరంగా చాల మార్చుకున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్నో హిట్స్ మహేష్ కు వచ్చినా ‘పోకిరి’ ఇచ్చినంత క్రేజ్ మరే సినిమా ఇవ్వలేదు.
అటువంటి సినిమాకు సీక్వెల్ అనిపించేడట్లుగా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన ‘పోకిరి రిటర్న్స్’ టైటిల్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మతో ‘ఐస్ క్రీమ్’ సినిమాను తీసిన నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ భీమవరం టాకీస్ బ్యానర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు పొక్కకుండా ఈ నిర్మాత తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి రామ్ గోపాల్ వర్మ ఈ టైటిల్ తో సినిమాను తీసి మరో హాట్ న్యూస్ కు చిరునామాగా మారుతడా అనే సందేహాలు వస్తున్నాయి.
సినిమాలోని కథతో సంబంధం లేకుండా కేవలం టైటిల్ తో సినిమా పై వివాదాలు కొని తెచ్చుకుంటున్న వర్మ ఈ టైటిల్ పై ప్రయోగాలు చేసినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది. అసలు విషయం ఎప్పటికి బయటకు వస్తుందో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి