పర్ఫెక్ట్ మాస్ ఇమేజ్ తో తన యాక్షన్ తో మెప్పించే గోపీచంద్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనకపడ్డాడు. ప్రస్తుతం సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్న గోపీచంద్సినిమా మీద పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. గోపీచంద్, సంపత్ నందిల సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న గోపీచంద్ మూవీ తెలుగు సంవత్సరాది ఉగాది రోజు సినిమా రిలీజ్ ప్లాన్ చేశారట.

ఈ ఇయర్ ఏప్రిల్ 13న ఉగాది పండుగ వచ్చింది. పండుగకి సీటీమార్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డి టీం కోచ్ గా కనిపిస్తాడని అంటున్నారు. సినిమాలో తమన్నా గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఉగాదికి గోపీచంద్ సీటీమార్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉగాదికి రిలీజ్ చేసే సినిమాల లిస్ట్ పెరుగుతుంది.

అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీ ముందు సంక్రాంతికి అనుకున్నా ఉగాదికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇక నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 16 రిలీజ్ అని పోస్టర్ కూడా వేశారు. ఇక ఈ సినిమాలతో గోపీచంద్ సీటీమార్ కూడా వస్తుంది. బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ మూవీ బిబి3 కూడా ఉగాది టార్గెట్ తో వస్తుందని అంటున్నారు. మరి సీటీమార్ సినిమా అనుకున్న టైం కు వస్తుందా పోటీ నుండి తప్పుకుంటుందా అన్నది చూడాలి.                                            

మరింత సమాచారం తెలుసుకోండి: