ఈమధ్యనే రాం చరణ్ ఆచార్య సెట్ లోకి అడుగు పెట్టాడు. ఆ టైం లో కొందరు మెగా ఫ్యాన్స్ రాం చరణ్ ను చూడాలని ఉత్సాహం చూపించగా చరణ్ పర్మిషన్ మేరకు సెట్స్ లోకి ఫ్యాన్స్ రావడం జరిగిందట. అయితే అలా వచ్చిన ఫ్యాన్స్ ఆచార్య సెట్ ఫోటోలను తీసుకొని సోషల్ మీడియాలో లీక్ చేశారు. సినిమాకు చాలా కీలకమైన ఈ సెట్ లీక్ అవడం పట్ల కొరటాల శివ అసంతృప్తిగా ఉన్నాడు. అందుకే తన టీం కు సీరియస్ గా క్లాస్ పీకినట్టు తెలుస్తుంది.
సాధారణంగా ఎప్పుడూ చాలా పాజిటివ్ గా కూల్ గా ఉండే కొరటాల శివ చిరుతో సినిమా డెఫినెట్ గా హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఫుల్ ఫోకస్ గా ఉన్నారని తెలుస్తుంది. అందుకే సినిమా నుండి ఎలాంటి లీక్స్ జరిగినా సినిమాకు నష్టం వస్తుందని తన టీం పై సీరియస్ అవుతున్నారు. ఆచార్య సినిమాలో చిరుతో పాటుగా చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు. సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ కెరియర్ లో ఎప్పుడూ చేయని కొత్త పాత్రలో కనిపించనున్నారట. చరణ్ కు ఈ ఇయర్ సూప్గర్ గా ఉండబోతుంది. ఓ పక్క ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ఆచార్య సమ్మర్ టార్గెట్ తో వస్తుంది. ఈ రెండు సినిమాలతో చరణ్ పేరు మారుమోగుతుందని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి