ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... విశ్వ నటుడిగా  కమల్ హాసన్ కి ఎంతో పేరుంది. ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశం మొత్తం గర్వ పడే నటుడు కమల్ హాసన్. ఇక ఆయన  కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన సొంత ట్యాలెంట్ తో బోలెడంత మంది అభిమానులని సొంతం చేసుకుంది  శృతీ హాసన్. మ్యూజిక్ డైరెక్టర్ గా.. డ్యాన్సర్ గా పలు ఆల్బమ్స్ చేసిన శృతీ.. వాటితో సక్సెస్ సాధించిన తరువాతే హీరోయిన్ గా మారింది. కెరీర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాలు అంతగా ఆడలేదు కానీ… ‘గబ్బర్ సింగ్’ చిత్రం మాత్రం ఈమెను గోల్డెన్ లెగ్ గా మార్చేసింది.అటు తరువాత ఈమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు హిట్లే. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో విదేశీయుడితో ప్రేమలో పడి సినిమా కెరీర్ ను ఈమె నిర్లక్ష్యం చేసి అనవసరంగా పోగొట్టుకుంది.

ఇక ఇప్పుడు తన ప్రియుడికి  బ్రేకప్ చెప్పేసి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది మన శృతీ హాసన్. ఈ సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ‘వకీల్ సాబ్’ లో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘సలార్’ లో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యింది.మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది అంటే ఈమెకు ఉన్న క్రేజ్ ఎటువంటిదో  అర్ధం చేసుకోవచ్చు.

ఇక శృతి గతంలో కొన్ని తెలుగు సినిమాలను మిస్ చేసుకుందట. అవేంటంటే  మహేష్ బాబు – పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వచ్చిన "బిజినెస్ మ్యాన్"  మూవీని శృతీ మిస్ చేసుకుంది. దాంతో కాజల్ ను ఫైనల్ చేశారు.ప్రభాస్- రాఘవ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రెబల్’ సినిమాలో హీరోయిన్ గా శృతీ హాసన్ ను అనుకున్నారు. అయితే ఏ పాత్రకు అన్నది క్లారిటీ లేదు. ఏదైనా శృతీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మిస్ చేసుకుంది.గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన  సూపర్ హిట్ మూవీ "జెర్సీ" ని కూడా శృతీ మిస్ చేసుకుందట.శ్రీను వైట్ల, రవి తేజ కాంబినేషన్ లో వచ్చిన "అమర్ అక్బర్ ఆంటోని"  చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వస్తే శృతీ వదులుకుందట.ఇక అల్లు అర్జున్ "దువ్వాడ జగన్నాధం" చిత్రానికి కూడా మొదట శృతీ హాసన్ నే హీరోయిన్ గా అనుకున్నారు.కానీ ఆమె నో చెప్పడంతో పూజ హెగ్డే ని ఫైనల్ చేశారట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: