గత సంవత్సరం సంక్రాంతికి అల్లు అర్జున్ తన ‘అలవైకుంఠ పురములో’ మూవీతో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ పై ఆధిపత్యం ప్రదర్శించి గత సంవత్సరం సంక్రాంతి విజేతగా మారడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ ను కూడ అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడ ఊహించని విధంగా మహేష్ బన్నీల మధ్య పోరు తప్పదా అన్న సందేహాలు వస్తున్నాయి.


సినిమాలకు ప్రేక్షకులు వస్తున్నారు అన్న నమ్మకం ఏర్పడటంతో వరసపెట్టి హీరోలు నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నారు. ఫిబ్రవరి నెల నుండి అక్టోబర్ నెల వరకు విడుదలకాబోయే సినిమాల రిలీజ్ డేట్స్ చాల ముందుగా ఫిక్స్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ తన ‘పుష్ప’ రిలీజ్ డేట్ ను ఆగష్టు 13 అంటూ ప్రకటించడంతో మహేష్ ఆలోచనలకు చెక్ పడింది అన్న ప్రచారం జరుగుతోంది.


మహేష్ లేటెస్ట్ గా మొదలుపెట్టిన ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత ఎలాంటి గ్యాప్ లేకుండా ఈమూవీని వేగంగా పూర్తిచేసి ఆగష్టు 13న విడుదల చేయాలి అన్న ఆలోచన మహేష్ కు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇంకా పూర్తిగా ఖరార్ కాకుండానే బన్నీ తన ‘పుష్ప’ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి మహేష్ కు ఊహించని షాక్ ఇచ్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


దీనితో ఈమూవీ మహేష్ వేగంగా పూర్తి చేసినా ఆగష్టులో విడుదల చేయడం కష్టమని ఆతరువాత వచ్చే దసరా కు విడుదల చేద్దాము అనుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాను తట్టుకోవడం కష్టం కాబట్టి ఈమూవీని  వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు . కరోనా సమస్యలు వల్ల షూటింగ్ లు వాయిదా పడ్డ ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ మూవీలు ఇంకా సగం కూడ పూర్తి కాకుండానే రిలీజ్ డేట్స్ వైపు అడుగులు వేయడం ఆశ్చర్యంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: