ఇందులో భాగంగానే ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో పది రోజుల పాటు యాక్షన్ తరహా సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్రబృందం తెలియజేశారు. షూటింగ్ లొకేషన్స్ లో సెట్టింగ్ పనులు పూర్తవ్వగానే చిత్రబృందం షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించడానికి దిశా పటాని, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని శృతిహాసన్ దక్కించుకున్నట్లు తాజాగా చిత్రబృందం తెలియజేశారు.
నేడు శృతిహాసన్ 35 వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాతో మంచి విజయంలో ఉన్న శృతి హాసన్ మరో మంచి అవకాశాన్ని దక్కించుకుందని చెప్పవచ్చు. మొదటిసారిగా ప్రభాస్ తో జతకట్టనున్న శృతిహాసన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే శృతి హాసన్ తాజాగా నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సలార్ సినిమాకు సంగీతం రవి బస్రూర్ అందించగా సినిమాటోగ్రఫీ భువన్ గౌడ్ నిర్వహిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి