ఓ వైపు కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే రద్దు చేయడానికి ప్రభుత్వం అస్సలు సిద్ధంగా లేదని తెలుస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇప్పటికీ వ్యవసాయ చట్టానికి చాలామంది రైతులు ఆరోపిస్తున్నారని కొద్దీ మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.. రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన విధ్వంశం చూసి అయినా మోడీ మనసు కరగట్లేదు.. కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాల వల్ల రైతుల కు మరింత లాభం చేకూరుతుందని, దీనివల్ల వారి ఆదాయం మరింత పెరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సహా కేంద్ర మంత్రులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, ప్రపంచ నాయకులను తన ప్రసంగంతో కడిగిపారేసిన యువ కెరటం గ్రెటా థంబర్గ్ కూడా భారత్‌లో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపింది. ప్రముఖ బార్బేడియన్ సింగర్, నటి, వ్యాపారవేత్త రాబిన్ రిహన్నా కూడా రైతు ఉద్యమానికి తన మద్దతు తెలిపింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. దీని గురించి మనమంతా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. తాజాగా.. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై మాజీ పోర్న్ స్టార్, క్రీడా వ్యాఖ్యాత మియా ఖలీఫా కూడా స్పందించింది. ఏ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఇంటర్నెట్‌ను న్యూఢిల్లీలో నిలిపివేశారని ఆమె ప్రశ్నించింది. తాను రైతుల పక్షాల నిలబడతానని మియా ట్వీట్ చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి