ఆమె పిక్ ను ఓ డేటింగ్ యాప్ లో పెట్టారట. అంతేకాదు ఆమె పేరు తార, హాసిని అని కూడా మార్చేశారట. కొందరు పునర్నవి స్నేహితులు ఆ డేటింగ్ ఆప్ లో ఆమెను చూసి తనకు తెలియచేశారట. అయితే తనకు ఆ డేటింగ్ యాప్ లకు ఎలాంటి సంబంధం లేదని ఇంతవరకు తను ఆ యాప్ లో లను కూడా వాడలేదని అంటుంది పునర్నవి. తను ఇంతవరకు ఎవరితో డేటింగ్ చేయలేదని. ఇలా తన ఫోటోలు ఆ యాప్ లో పెట్టిన వారిని లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెబుతుంది అమ్మడు.
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ రోల్ చేసిన పునర్నవి సోలో హీరోయిన్ గా కూడా చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3లో అమ్మడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. సీజన్ 3లో విన్నర్ రాహుల్ తో పునర్నవి నడిపించిన ప్రేమ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. హౌజ్ లో బాగా క్లోజ్ అయిన వీరు బయటకు వచ్చాక కొన్నాళ్లు కలిసి కనిపించినా చివరికి ఎవరి దారి వారు చూసుకున్నారు. పునర్నవి వెబ్ సీరీస్ లను చేస్తుంది. మెంటల్ మదిలో వెబ్ సీరీస్ తో ఈమధ్యనే అమ్మడు ప్రేక్షకులను అలరించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి