ప్రభాస్ లైఫ్‌లో డ్రీమ్ గర్ల్స్‌ ఉన్నారా..? ఉంటే పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు.. అనే ప్రశ్నలకి ఇప్పటికి సమాధానాలు అయితే దొరకడం లేదు. ఏళ్ల తరబడి ఇది మిలియన్‌ డాలర్స్‌ క్వశ్చన్‌లాగే మిగిలిపోయింది. అయితే సినిమాల్లో మాత్రం ఏరికోరి బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్స్ నే సెలక్ట్‌ చేసుకుంటున్నాడు డార్లింగ్.

బాలీవుడ్‌కి సల్మాన్‌ ఖాన్.. టాలీవుడ్‌కి ప్రభాస్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అని జనాలంతా ఫిక్స్ అయిపోయారు. ఇక మేకర్స్‌ సల్మాన్‌ సినిమాని ఎంత భారీగా రూపొందిస్తారో, ప్రభాస్‌ మూవీని కూడా అలాగే లార్జ్‌ స్కేల్‌లో డిజైన్ చేస్తున్నారు. డార్లింగ్‌ కోసం అలనాటి డ్రీమ్‌గర్ల్స్‌ని దింపుతున్నారు దర్శకనిర్మాతలు.

ప్రభాస్ బాలీవుడ్ మేకర్‌ ఓం రౌత్‌ దర్వకత్వంలో 'ఆది పురుష్' అనే సినిమా చేస్తున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తోంటే, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీలో రాముడి తల్లి కౌసల్యాదేవి పాత్రకి బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమమాలినిని తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్‌ 'రాధేశ్యామ్' సినిమాకి కూడా ఒకప్పటి బ్యూటీ క్వీన్‌ భాగ్యశ్రీని తీసుకొచ్చారు. రాధాక్రిష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈసినిమాలో భాగ్యశ్రీ డార్లింగ్‌కి మదర్‌గా నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో భాగ్యశ్రీకి మీరు నా ఫస్ట్ క్రష్‌ అని చాలా సార్లు చెప్పాడట ప్రభాస్.

మొత్తానికి ప్రభాస్ కు మరో తల్లి దొరికేసింది. టాలీవుడ్ డ్రీమ్ గాళ్ ను రెబల్ స్టార్ కు మదర్ గా ఫిక్స్ చేసేశారు. ఆదిపురుష్ లో హేమమాలినికి ఆ పాత్రను కట్టబెట్టేశారు. అయితే బాహుబలిలో ప్రభాస్ కు తల్లిగా నటించిన రమ్యకృష్ణ ఆ క్యారెక్టర్ కు న్యాయం చేశారు. అలాంటి పాత్రే ఇపుడు హేమమాలినికి వచ్చింది. ఒకప్పుడు టాలీవుడ్ డ్రీమ్ గాళ్ గా పేరు తెచ్చుకున్న ఈమె.. ఇపుడు ఈ సినిమాతో తన టాలెంట్ చూపిస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: