ప్రస్తుతం దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాం చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా కె కె సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా 1920ల కాలం నాటి కథగా పెట్రియటిక్ మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. వాస్తవానికి గత ఏడాది జులై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వలన అప్పటి నుండి వాయిదాలు పడుతున్న విషయం అందరికీ విదితమే. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారమరాజుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ కూడా యూట్యూబ్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి.

అయితే ఈ సినిమా పై రోజురోజుకు ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో తప్పకుండా అందరి అంచనాలు తమ మూవీ ఆదుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీపై పలువురు మూవీ లవర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. రికార్డ్స్ పరంగా ఇప్పటివరకు ఒక లెక్కని, ఇకపై ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత మరొక లెక్క అని, తప్పకుండా ఈ మూవీ అన్ని పాత రికార్డ్స్ బద్దలు కొట్టి సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం అని వారు అంటున్నారు. మరి ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే మరికొన్ని నెలల వరకు వెయిట్ చేయాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: