సూపర్ స్టార్ మహేష్ బాబు యువ దర్శకుడు పరశురాం పెట్ల ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికెవ్వరు వంటి మూడు సక్సెస్ లతో కెరీర్ పరంగా మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ మూవీ తో కూడా భారీ సక్సెస్ అందుకని, మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు.

14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రస్తుతం దుబాయ్ దేశంలో జరుగుతోంది. ఇటీవల మన బ్యాంకులను కుదిపేసిన పలు ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా యొక్క స్టోరీ విషయమై ప్రస్తుతం ఒక వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.
దాని ప్రకారం ఈ మూవీ యొక్క కథ పలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందని, ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఉందని, ఆ ట్విస్ట్ తో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. అలానే మూవీ యొక్క ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ వంటివి కూడా ఎంతో ఆకట్టుకుంటాయని, తప్పకుండా ఈ మూవీ రిలీజ్ తరువాత అందరినీ అలరించి సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సర్కారు వారి పాట మూవీ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: