ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ విజేతగా రవితేజా ‘క్రాక్’ మారడంతో ఇప్పటి వరకు డల్ గా కొనసాగిన రవితేజా మార్కెట్ ఊపందుకుంది. దీనితో మే లో విడుదలకాబోతున్న ‘ఖిలాడీ’ మూవీ రైట్స్ గురించి బయ్యర్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే ఈ మూవీ నిర్మాతలు చెపుతున్న ఏరియా రైట్స్ కు సంబంధించిన రేట్లను చూసి బయ్యర్లు కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్. ‘క్రాక్’ కలక్షన్స్ ను ఆధారంగా తీసుకుని ‘ఖిలాడీ’ నిర్మాతలు ఈ రేట్స్ ను కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేసి భారీ యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ భారీ యాక్షన్ సీన్స్ కు అదేవిధంగా ఆ యాక్షన్ సీన్స్ కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కు భారీగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. దీనితో ఈమూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో ఈమూవీ రైట్స్ కు సంబంధించి రేట్లు కూడ బాగా పెరిగాయి అని అంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి రేస్ కు వచ్చిన సినిమాలలో ‘క్రాక్’ కు పోటీ ఇవ్వగల మరొక సినిమా విడుదల కాలేదు. దీనికితోడు కరోనా పరిస్థితులు వల్ల ధియేటర్లకు దూరంగా ఉన్న ప్రేఖకులు ఒక్కసారి ఒక మాస్ సినిమాను చూడటంతో ‘క్రాక్’ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.


అయితే సమ్మర్ రేస్ పరిస్థితి వేరు ఈసారి సమ్మర్ సీజన్ కు ఎప్పుడు లేని విధంగా టాప్ హీరోల సినిమాలు అన్నీ లైన్ కడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇన్ని సినిమాల మధ్య విడుదల కాబోతున్న ‘ఖిలాడీ’ మూవీకి ‘క్రాక్’ స్థాయిలో కలక్షన్స్ వస్తాయి అని ఆశించడం దురాశ అవుతుందని ఈ మూవీని కొనాలని ఉత్సాహ పడుతున్న బయ్యర్లు అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ మూవీ దర్శకుడు రమేష్ వర్మ సమర్థత పై కూడ కొన్ని సందేహాలు ఉండటంతో ఈ మూవీని కొనాలని అనుకుంటున్నా బయ్యర్లు కన్ఫ్యూజ్ లో ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: