సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ప్రతినాయకుడిగా  తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కొంత మంది నటులలో  అజయ్ కూడా ఒకడు . అజయ్ ప్రతినాయకుడిగా  విక్రమార్కుడు,ఒక్కడు, సై, గబ్బర్ సింగ్, దూకుడు వంటి సినిమాలలో  డిఫరెంట్ పాత్రలతో నటించి,తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అజయ్ విజయవాడకు చెందినవాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాలలోనే ముగిసింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఒక కళాశాలలో చేరాడు. అయితే నటన మీద ఆసక్తితో,అక్కడే మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరి నటనలో కోర్సు పూర్తిచేశాడు.


అయితే అజయ్ తండ్రికి,దర్శకుడు వేమూరి జ్యోతి కుమార్ కు మంచి పరిచయం ఉండడంతో మొదటగా కౌరవుడు అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత 9 నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఖుషి సినిమా నటీనటుల సెలక్షన్లలో  ఎంపికయ్యాడు. అందులో అజయ్ చేసిన పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి,అజయ్ ఏ పాత్రలో చేసినా ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయగలడని, అలా మంచి పేరును సంపాదించుకున్నాడు ప్రేక్షకులలో.


అయితే అజయ్ వ్యక్తిగత విషయానికొస్తే,అజయ్ భార్యను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఒకప్పుడు మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. తన పేరు శ్వేత, అజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అజయ్ తో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కొడుకులు కూడా జన్మనిచ్చింది. అయినప్పటికీ ఆమె నిత్యం వర్కౌట్స్ చేస్తూ, హీరోయిన్స్ కంటే తక్కువ ఏమీ కాదని నిరూపించుకుంటోంది . అజయ్ సపోర్ట్ తో ఆమె ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.


పెళ్లయిన తర్వాత కూడా ఆమె రెగ్యులర్ మోడల్ గానే దర్శనమిస్తూ వుంటుంది. ఇక అజయ్ ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది "సరే లేరు నీకెవ్వరు, భీష్మ" వంటి సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు  వారి పాట లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: