ఇక తొలి సినిమా ద్వారా బాగా పాపులారిటీని అందుకుంది దీక్షాసేత్. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అయితే వేదం సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత గోపీచంద్ వాంటెడ్, ప్రభాస్ రెబల్, రవితేజ మిరపకాయ వంటి సినిమాలలో నటించి,తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇందులో రవితేజతో చేసిన మిరపకాయ సినిమా మినహా మిగతా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి.
దీనితో ఒక్కసారిగా మెరిసిన దీక్షాసేత్ , ఒక వరుస ఫ్లాప్ లు రావడంతో, సినిమాల్లో పూర్తిగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇక దీనితో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ వైపు మళ్లింది. ఇక ఈ సినిమా కూడా బాలీవుడ్ లో బోల్తా పడడంతో ఆమె పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పేసి,దూరంగా వెళ్ళిపోయింది. ఇక ఈమె వ్యక్తిగత విషయానికొస్తే దీక్షాసేత్ మోడలింగ్ రంగంలో ఒక రేంజిలో రాణించిన వాళ్ళలో ఒకరు. 2009 లో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో ఫైనలిస్ట్ గా వచ్చిన దీక్షసేత్, ఆ తర్వాత మోడలింగ్ కాంటెస్ట్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన సమయంలో, డైరెక్టర్ క్రిష్ దృష్టిలో పడింది. ఇంకా అప్పటికే ఆయన వేదం సినిమాలో అల్లు అర్జున్ కి హీరోయిన్ గా నటించే అమ్మాయిల కోసం దాదాపు 80 మందిని ఆడిషన్ చేసి రిజెక్ట్ చేశాడు.
ఇక డైరెక్టర్ దీక్ష ను చూడగానే ఆ 80 మందిని పక్కన పెట్టేసి,ఈమెను హీరోయిన్ గా ఎంచుకున్నాడు . ఇక 2016 సంవత్సరం తర్వాత కనీసం మీడియాకి కూడా దొరకకుండా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ లో కానీ ఈమె గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. అయితే ఇటీవల ఈమె గురించి బయటపడ్డ సంచలన విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2016 సంవత్సరం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన దీక్షాసేత్ నటిగా గుడ్బై చెప్పేసి, తర్వాత నిర్మాతగా మాత్రం ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేసిందట. ఇక ఈమె నిర్మాతగా వ్యవహరించిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి