మహేష్ బాబు పరుశురామ్ కాంబినేషన్ లో మూవీ  ‘సర్కారువారి పాట’ షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘దూకుడు’ సినిమా తరువాత మళ్ళీ హీరోయిన్ హీరో ట్రాక్ ‘సర్కారువారి పాట’ సినిమాలో బాగా కుదిరింది అని వార్తలు వస్తున్నాయి.  ‘దూకుడు’ మూవీలో ఉన్న విధంగా హీరోయిన్ టీజింగ్ సీన్లతో మంచి ఫన్ పండించే విధంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే ను పరుశు రామ్ డిజైన్ చేసాడు అని టాక్.  


ముఖ్యంగా మహేష్ కీర్తి ల నడుమ మంచి ఫన్ సీన్లు ఈ మూవీకి హైలెట్ గా నిలుస్థాయి అని అంటున్నారు.  ఇలా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈమూవీ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. ఈమూవీ వ్యూహాలకు ప్రభాస్ ‘సలార్’ ఊహించని షాక్ ఇవ్వ బోతున్నట్లు టాక్. అప్పుడే ఈ చిత్ర షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖని రామగుండం ప్రాంతాల్లో జరిపి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు.


ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ తో పాటు ప్రభాస్ శృతిహాసన్ కాంబోలో సన్నివేశాలు కూడ చిత్రీకరించారు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సలార్’ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీల్ అండ్ టీమ్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూట్ ని కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


22 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ తో ఈ షూటింగ్ చేస్తున్న ప్రశాంత్ అక్టోబర్ లోపు ఈమూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసి ఈసినిమాను 2022 సంక్రాంతికి టార్గెట్ గా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలే నిజం అయితే వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ విజేతగా మారాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న మహేష్ కు ఇది గట్టి షాక్ గత సంవత్సరం సంక్రాంతికి మహేష్ కు అల్లు అర్జున్ తో పోటీ ఏర్పడితే వచ్చే ఏడది ప్రభాస్ తో మహేష్ కు తిప్పలు తప్పేలా లేవు..

మరింత సమాచారం తెలుసుకోండి: