ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది' మంచి టాక్ ని సొంతం చేసుకోని డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం అల్లరి నరేష్ కు మంచి విజయాన్ని అందించింది. 9 ఏళ్లుగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్న నరేష్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చి.. అతన్ని ప్లాపుల నుండీ బయటపడేసింది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 'ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఇప్పటివరకూ కామెడీ హీరోగానే రాణిస్తూ వచ్చిన నరేష్.. ఈసారి కంప్లీట్ సీరియస్ రోల్ ప్లే చేసిన చిత్రమిది.ఈ సినిమాతో నటన పరంగా మంచి ప్రశంసలు పొందుతున్నాడు అల్లరి నరేష్...ఇక గమ్యం, నేను, మహర్షి సినిమాల తరువాత ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ఎంత గానో ఆకట్టుకున్నాడు...


ఇక ఈ సినిమా 8 రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే...నాంది' చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.2.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.2కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది ఈ చిత్రం.ఇక 8 రోజులు పూర్తయ్యేసరికి 3.64 కోట్ల షేర్ ను రాబట్టి డీసెంట్ రన్ కొనసాగిస్తుంది. అయితే నిన్న 'చెక్' 'అక్షర' వంటి చిత్రాలు విడుదలవ్వడంతో కొంత డల్ అయ్యింది.. అంతేకాకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి.. ఆ ఎఫెక్ట్ కూడా 'నాంది' కలెక్షన్ల పై పడింది. లేకుంటే ఈ చిత్రం మరింతగా కలెక్ట్ చేసేదనే చెప్పాలి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: