సారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. నటి సాయి పల్లవి.. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోదు. సెలెక్టెడ్‌ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ స్థాయి ఏర్పాటు చేసుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధమైంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సారంగదరియా సాంగ్‌ అదరగొట్టేస్తోంది.


సారంగ దరియా పాట విడుదలైన 24 గంటల్లో ఏకంగా 7 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ నేపథ్యంలో ఈ పాటకు కొరియో గ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్‌.. సాయిపల్లవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాయి పల్లవిని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు అవుతుంది. ఆమె ఏ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా బాగుంటుంది. ఒకసారి పాట ఎడిట్ చేసి చూస్తే తనకంటే బాగా ఇంకెవరూ చేయలేరేమో అనిపిస్తుంది.. అంటూ సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు శేఖర్ మాస్టర్.


సాయిపల్లవి క్లాసికల్ డాన్సర్. కొరియాగ్రఫర్స్ కొన్ని మూమెంట్స్ అనుకుంటారు. వాటిని హీరో, హీరోయిన్ కరెక్ట్‌గా చేస్తేనే బాగుంటుంది. సాయి పల్లవితో ఈ మూవ్‌మెంట్ రాదు అని ఎప్పుడూ అనుకోలేదు. మేము చెప్పిన మూవ్‌మెంట్స్‌ను ఇంకా బాగా చేసి చూపిస్తుంది. మాలాంటి డాన్స్ మాస్టర్‌లకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం అంటూ తెగ పొగిడేశారు. అంతేకాదు.. తను డ్యాన్స్‌ చూస్తే.. నెమలి నాట్యం ఆడినట్లే ఉంటుంది. స్టార్‌ హీరోలకు కూడా కష్టంగా భావించే స్టెప్స్‌ని తను చాలా చేస్తుంది. డ్యాన్స్‌ విషయంలో తనతో ఏ హీరోయిన్‌ పోటి పడలేరు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు శేఖర్‌ మాస్టర్‌.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌ స్టోరి’ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట ఆదివారం సమంత చేతుల మీదుగా విడుదలైంది.  సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ ఫోక్‌ బీట్‌ అందించిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. మంగ్లీ ఆలపించారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరి’. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందంచారు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది లవ్ స్టోరి.

మరింత సమాచారం తెలుసుకోండి: