మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా తన స్నేహితుడు ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. సముద్రఖని, శ్రియ శరణ్, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని, సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని, విజయేంద్రప్రసాద్ కథని, సాయిమాధవ్ బుర్రా మాటల్ని అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాపై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ లెవెల్ లో ఎంతో భారీగా రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది. దీని తరువాత యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్సినిమా చేస్తారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి ఈ వార్త చాలా రోజుల నుంచి ప్రచారం అవుతుండగా ఈ మూవీ పక్కాగా రెండు రోజల క్రితం ఫిక్స్ అయిందని అంటున్నారు.

మూవీ యొక్క స్టోరీ ని రెండు రోజుల క్రితం రామ్ చరణ్ ఓకే చేశారని మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదిరిపోతుందని అలానే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించనున్నట్లు టాక్. ఇక అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మహఃశివరాత్రి పండుగ రోజున వస్తుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: