బాలీవుడ్ నే కాకుండా టాలీవుడ్ ను కూడా షేక్ చేస్తున్న సన్నీ లియోన్ ఈ కొత్త సంవత్సరంలో జరిగిన న్యూయియర్ సెలెబ్రేషన్స్ కు భాగ్యనగరం వచ్చి చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. ఈ వార్తల హడావిడి ఇంకా జనం పూర్తిగా మరిచిపోకుండానే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సన్నీ స్పెషల్ సాంగ్ చేయబోతోంది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి. కొరటాల శివ దర్సకత్వంలో మహేష్ బాబు, శ్రుతిహాసన్ లు జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

ఫిబ్రవరిలో ఈ సినిమా యూనిట్ పోలాచ్చి నుంచి తిరిగి వచ్చిన తరువాత సన్నీలియోన్ తో ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించి ఒక ప్రత్యేకమైన సెట్ ను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మహేష్ బాబు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈసారి సన్నీతో మహేష్ స్టెప్స్ వేస్తే ఈ సినిమాకు బయ్యర్లలో మరింత క్రేజ్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ‘కరెంట్ తీగ’ సినిమాలో సన్నీ స్పెషల్ సాంగ్ చేసినా ఆమె వల్ల ఆ సినిమా కలెక్షన్స్ ఒక్క రూపాయి కూడా పెరగలేదు.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో సూపర్ హిట్ కోసం పరితపిస్తున్న మహేష్ కోరిక నెరవేరడానికి తన సాయం కూడా అందిస్తున్న సన్నీ లియోన్ క్రేజ్ ఏ మాత్రం పని చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: