ఉగాది రోజున  తన సినిమా పై తన సినిమానే పోటీగా విడుదల చేసుకుని మూడు దశాబ్దాల క్రిందట బాలకృష్ణ సాధించిన రికార్డును మళ్ళీ నాని నిన్నటితో బ్రేక్ చేసాడు. హిట్  అన్న పదంవిని సంవత్సరాలు గడిచిపోయిన నేపధ్యంలో నిన్న నాని నటించిన రెండు సినిమాలు ఇరు రాష్ట్రాలలో డిఫరెంట్ టాక్ తెచ్చు కోవడం నానీకే ఆశ్చర్యంగా మారింది అని అంటున్నారు.

 

నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో వేదాంతం ఎక్కువైందని సగటు  ప్రేక్షకుడి  టాక్. ఈసినిమా నగరాలలో ఉండే మల్టీ ప్లేక్స్ ఆడియన్స్ కు నచ్చినా కోస్తా ప్రాంత జిల్లాలోని మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చలేదు. కానీ విమర్శకుల నుంచి మాత్రం ఈ సినిమా గురించి మంచి కామెంట్స్ వస్తున్నాయి. అయితే  నాని కనీసం ప్రమోట్ కూడా చేయకుండా ఆ సినిమా పేరు చెప్పడానికే భయపడిపోతున్న  ‘జెండా పై కపిరాజు’ సినిమా  విశ్లేషకులకు నచ్చకపోయినా సగటు ప్రేక్షుడికి కిక్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా కోస్తా జిల్లాలోని బి, సి సెంటర్లలోని మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చడం విశేషం. ముఖ్యంగా సామాన్యుడు తరుచు మాట్లాడుకునే లంచగొండి తనం పై ఈ సినిమా కథ ఉండటంతో సగటు ప్రేక్షకుడు ఈసినిమాతో కనెక్ట్ అయ్యాడని టాక్. ఎలా ఆలోచించినా నిన్న విడుదలైన నాని  రెండు సినిమాలు రెండు రకాల  టాక్స్ తెచ్చుకోవడం నానికే ఆశ్చర్యంగా మారింది అని టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: