వారసులు సినిమా రంగంలో కొత్త విషయమేమీ కాదు. తమ కంటూ ఓ గుర్తింపు వచ్చాక తమ వారిని ప్రేక్షకులకు పరిచయం చేయడం ఇక్కడ సామాన్యమైన విషయం. ఈ కోవలోనే మరో హీరో తమ్ముడు ప్రేక్షకులకు పరిచయం కావడానికి సిద్ధపడుతున్నాడు.
తమిళంలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్య తెలుగులో కూడా ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు అతని చేతిలో కొన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్య తమ్ముడు సత్య హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సత్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. అన్నయ్యే తనకు ఆదర్శమని, అతనిలా కష్టపడి పైకి వస్తానని ఆర్య తమ్ముడు సత్య అంటున్నాడు.
మరింత సమాచారం తెలుసుకోండి: