తెలుగు తెరకు మరో కొత్త హీరోయిన్ పరిచయం కానుంది. నందమూరి తారక రత్న హీరోగా ‘ఎదురు లేని అలెగ్జాండర్’ అనే కొత్త సినిమా షూటింగ్ సోమవారం నాడు ప్రారంభం అయ్యింది. పి.ఎల్.కె. రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
తారక రత్న పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాలో కుంకుమ అనే ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. టీవీ రంగం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి